కేంద్ర దర్యాప్తు సంస్థలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర దర్యాప్తు..telugu latest news

Update: 2022-04-01 13:43 GMT

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చర్య, నిష్క్రియలతో దాని విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. శుక్రవారం సెంట్రల్ ఏజేన్సీ కార్యక్రమంలో 'ప్రజాస్వామ్యం: దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు' అనే అంశంపై సీజేఐ రమణ మాట్లాడారు. సామాజిక చట్టబద్ధత, ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడం ఈ సమయంలో అవసరమని అన్నారు. దానికి మొదటి అడుగు రాజకీయ, కార్యనిర్వాహక సంబంధాలను విచ్ఛిన్నం చేయడమేనని సూచించారు. అంతేకాకుండా బ్రిటీష్ కాలం నుంచి దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో ఆయన వివరించారు. 'అవినీతి ఆరోపణలతో పోలీసుల ప్రతిష్ట మసకబారుతోంది. అధికార యంత్రాంగంలో మార్పుతో తాము వేధింపులకు గురవుతున్నామని తరచూ పోలీసు అధికారులు మమ్మల్ని సంప్రదించేవారు. రాజకీయ నాయకులు సమయంతో మారుతారు. కానీ మీరు శాశ్వతం' అని అన్నారు. ఏ సంస్థ అయినా కేవలం కొంతమంది అధికారులే మార్పు తీసుకురాగలరని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.

Tags:    

Similar News