భారీ డిస్కౌంట్‌లు ప్రకటించిన వాహన తయారీ కంపెనీలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వాహన తయారీ కంపెనీలు ఈ నెలలో రానున్న హోలీ పండుగ..telugu latest news

Update: 2022-03-09 13:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వాహన తయారీ కంపెనీలు ఈ నెలలో రానున్న హోలీ పండుగ నేపథ్యంలో పలు మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులతో పాటు ప్రత్యేక ఆఫర్లను పకటించాయి. వీటిలో ప్రధానంగా మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు నగదు తగ్గింపు, కొనుగోలు చేయాలనుకునే మోడల్‌ను బట్టి కార్పొరేట్ డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు చెబుతున్నాయి. వీటితో పాటు వినియోగదారుల అవసరాన్ని బట్టి ఆఫర్లలో మార్పులు చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్నాయి.

దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్-ఆర్, ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెసో, బ్రెజా, స్విఫ్ట్ వంటి కార్లపై మోడల్‌ని రూ. 5000-రూ. 25,000 వరకు తగ్గింపును ప్రకటించింది. అలాగే, కార్పొరేట్ బోనస్ కింద మరో రూ. 4,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే, కొన్ని వేరియంట్లపై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇదే బాటలో టాటా మోటార్స్ సైతం టియాగో, హారియర్, టిగోర్, పంచ్, ఆల్ట్రోజ్, నెక్సాన్ మోడల్‌ను బట్టి రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు తగ్గింపుతో పాటు రూ. 40 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 వరకు కార్పొరేట్ బోనస్ ఇవ్వనుంది.

మహీంద్రా సైతం తన కేయూవీ100 ఎన్ఎక్స్‌టీ, మరాజో, స్వదేశీ తయారీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఆల్టరస్ మోడళ్లపై రూ. 20 వేల నుంచి రూ. 2.2 లక్షల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే, రూ. 3,000-11,500 వరకు కార్పొరేట్ తగ్గింపుతో పాటు మోడల్‌ను బట్టి రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని వాహనాలకు రూ. 10 వేల విలువైన ఉచితంగా యాక్సెసరీస్ ఇవ్వనుంది.

Tags:    

Similar News