నేడు యూపీ.. రేపు తెలంగాణలో బీజేపీ జెండా!

దిశ, ఆమనగల్లు: బీజేపీ ఖతం అన్న వారికి - BC Commission members Talloju Achari comments on results of the four states

Update: 2022-03-10 12:16 GMT

దిశ, ఆమనగల్లు: బీజేపీ ఖతం అన్న వారికి 4 రాష్ట్రాల ఫలితాలు చెంపపెట్టు లాంటివని, యూపీ ఫలితాలే తెలంగాణ లో రిపీట్ అవుతాయని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయడంతో గురువారం ఆమనగల్ పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. 4 రాష్టాల ఎన్నికల ఫలితాలతో ఫామ్ హౌస్ బీటలు వారాయని ఆచారి అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జాతీయ రహదారిపై బాణాసంచా కాల్చుతూ.. స్వీట్స్ తినిపించుకున్నారు. రేపటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృత్తం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు లక్ష్మణ్, కృష్ణ యాదవ్, విజయ్ కృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జి నరసింహ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News