Pulsar బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్: మార్కెట్లోకి సరికొత్త అప్డేట్ మోడల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బైక్ తయారీసంస్థ బజాజ్ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బైక్ తయారీసంస్థ బజాజ్ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. వినియోగదారులకు ఎంతో ఇష్టమైన పల్సర్ మోడల్లో కొత్తగా N160ని విడుదల చేసింది. ఇది కొత్త పల్సర్ సిరీస్‌లో మూడవ వేరియంట్. ఇది డిజైన్ పరంగా N250 మాదిరిగానే ఉంటుంది. దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. 164.8cc, ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంది. ఇంజన్ గరిష్టంగా 16PS పవర్‌తో పాటు 14.65Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. సింగిల్-ఛానల్ ABS లేదా డ్యూయల్-ఛానల్ ABS అనే రెండు ఎంపికలలో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ 37mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక యూనిట్ మోనో-షాక్ సస్పెన్షన్‌ను అమర్చారు. బైక్ వెనుక ట్విన్ LED టెయిల్ ల్యాంప్స్, స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గేర్ పొజిషన్, క్లాక్, ఫ్యూయల్, రేంజ్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇంతకుముందు వచ్చినటువుంటి పల్సర్ N250, పల్సర్ F250 లకు అప్డేట్ వెర్షన్‌గా N160 నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. బైక్ ప్రారంభ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).