T20 వరల్డ్ కప్ జట్టులో అతడు ఖచ్చితంగా ఉండాల్సిందే: మాజీ కోచ్

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2022-08-06 08:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే టీమిండియా జట్టులో భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఖచ్చితంగా ఉండాలని టీమిండియా మాజీ కోచ్ శ్రీధర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచకప్ జట్టులో పేస్ బౌలింగ్ విభాగంలో భువీ, షమీని తీసుకోవాలన్నారు. పేస్ ఆల్ రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్ రౌండర్ విభాగంలో జడేజా జట్టుకు సరితూగుతారన్నారు. ఇక ఆరో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అశ్విన్ చాలా టాలెంటెడ్ బౌలర్ అని.. అతడికి ఉన్న అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

అయితే, ఇటీవల అశ్విన్‌ను T20 జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీ క్రీడాకారులు తప్పుబడుతున్నారు. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. చాహల్, రవి బిష్ణోయ్, కుల్ దీప్ యాదవ్ వంటి మణికట్టు బౌలర్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

Similar News