ఆకురూపంలో అద్భుతమైన సముద్ర చేప..

దిశ, ఫీచర్స్ : సముద్ర గర్భంలోని రహస్య జీవుల జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగిస్తుంటారని తెలిసిందే.

Update: 2022-08-02 12:44 GMT

దిశ, ఫీచర్స్ : సముద్ర గర్భంలోని రహస్య జీవుల జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగిస్తుంటారని తెలిసిందే. ఈ క్రమంలో వింత ఆకారాలు, భారీ పరిమాణాలతో కూడిన వేలాది జీవులను కనుగొనగా.. తాజాగా వైజాగ్ తీరంలో ఒక అరుదైన సముద్ర చేప తొలిసారిగా వెలుగు చూసింది.

ఆకు వంటి ఆకారంతో రక్తనాళాలులేని ఈ జీవి.. లేత, ముదురు నీలి రంగుతో మధ్యలో ఎల్లో కలర్‌లో కనిపిస్తున్న వెన్నుతో చూపరులను ఆకర్షిస్తోంది. 'ఫ్లాట్ వార్మ్'గా పిలువబడే ఈ చేపలు.. ముఖ్యంగా సముద్రపు ఆటుపోట్లు సంభవించే ప్రాంతంలో బయటపడతాయి. దీంతో విశాఖకు చెందిన పరిశోధకులు ప్రతీ రెండు వారాలకోసారి ఆయా ప్రాంతాల్లో మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ ఫ్లాట్‌వార్మ్‌‌లు ఎక్కువగా చిన్న చిన్న పీతలు, ఇతర జీవులను తింటాయి. ఇవి అత్యంత విషపూరితమైనవి కావడంతోనే పెద్ద పెద్ద జంతువులు ఈ చేపలకు దూరంగా ఉంటాయి.

Tags:    

Similar News