ధామి కోసం రాజీనామాకు ఆరుగురు ఎమ్మెల్యేలు!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. latest telugu news..

Update: 2022-03-12 10:59 GMT

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో భవిష్యత్ సీఎం ఎవరనే విషయమై చర్చ నెలకొంది. శుక్రవారం తన రాజీనామాను సమర్పించారు. అయితే ధామి కి మద్దతుగా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నిలిచారు. ఆయన తిరిగి పోటీ చేయడానికి తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 'చంప వాట్ ఎమ్మెల్యే ఖైలాష్ గహటోడి, కాప్కోట్ ఎమ్మెల్యే సురేష్ గడియాలు ముందుగా ధామి కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

వీరిద్దరి తర్వాత మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సీఎం పుష్కర సింగ్ కోసం తమ స్థానాలను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు' అని రాష్ట్ర మీడియా ఇంచార్జి మన్వీర్ చౌహన్ అన్నారు. కాగా, బీజేపీ వరుసగా రెండో సారి ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చి కొత్త చరిత్ర సృష్టించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Tags:    

Similar News