ప్రజలకు అందుబాటులో టెలీ మెడిసిన్..

దిశ, మెదక్: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని జిల్లా కాలెక్టరేట్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. టెలీ మెడిసిన్ విధానాన్ని పటిష్టంగా నడిపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్ 70933 24551కు ఫోన్ చేసి వైద్యుడితో మాట్లాడారు. టెలీ మెడిసిన్ వైద్య సేవలను నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు.ఉదయం 9 గంటల […]

Update: 2020-04-13 08:27 GMT

దిశ, మెదక్: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని జిల్లా కాలెక్టరేట్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. టెలీ మెడిసిన్ విధానాన్ని పటిష్టంగా నడిపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్ 70933 24551కు ఫోన్ చేసి వైద్యుడితో మాట్లాడారు. టెలీ మెడిసిన్ వైద్య సేవలను నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు.ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9వరకు టెలీ మెడిసిన్ విభాగంలో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలకు అవసరమైన ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తారని వెల్లడించారు.

tags : corona, lockdown, tele medicine, inaugurated by minister harish rao

Tags:    

Similar News