ఈ నెల 16న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో.. మహిళలకు అదిరిపోయే శుభవార్త

తెలంగాణ ఎన్నికలకు ఏర్పాట్లను ఈసీ షురూ చేసింది. తుది ఓటర్ల

Update: 2023-10-04 13:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలకు ఏర్పాట్లను ఈసీ షురూ చేసింది. తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించగా.. ఎన్నికల నిర్వహణకు సన్నద్దమవుతోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోను సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ముందుగా ఎన్నికల హామీలు ప్రకటించగా.. బీఆర్ఎస్ ఇంకా కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే బీఆర్ఎస్ మేనిఫోస్టోను ప్రకటించేందుకు సిద్దమవుతోంది.

అక్టోబర్ 16న వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు బుధవారం తెలిపారు. ఇవాళ కొడంగల్‌లో ప్రభుత్వ  ఆస్పత్రిని హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో మహిళలకు వరాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. మహిళలకు శుభవార్తలు రెడీగా ఉన్నాయని, సిద్దంగా ఉండాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ వంటి హామీలను బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News