MLC కవితపై ఆకునూరి మురళి సీరియస్

మొదటి టర్మ్ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి లేకుండా చేసి నేడు మహిళలకు రిజర్వేషన్ గురించి కొట్లాడుతారట అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ధ్వజమెత్తారు.

Update: 2023-08-22 06:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మొదటి టర్మ్ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి లేకుండా చేసి నేడు మహిళలకు రిజర్వేషన్ గురించి కొట్లాడుతారట అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ లిస్టులో మహిళలెందరు? గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురికే ఛాన్స్.. అని ‘దిశ పేపర్’లో వచ్చిన కథనంపై ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విమానం అద్దెకు తీసుకుని.. లిక్కర్ స్కాంలో బిడ్డను అరెస్ట్ కాకుండా అరడజను మంత్రులను ఢిల్లీ పంపించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. గతంలో మరియమ్మ లాక్అప్ డెత్, లక్ష్మిని లాక్అప్ లో దారుణ చిత్రహింసలు పెడితే కవితక్క ఎక్కడ? అని ప్రశ్నించారు.

Click Here for Akunuri Murali Tweet about MLC Kavitha

Tags:    

Similar News