గజ్వేల్‌లో బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపించిన మహిళలు (వీడియో)

గ్రామాల్లో అధికార బీఆర్ఎస్ నేతలను అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న బీఆర్ఎస్‌కు అవే సంకటంగా మారుతున్నాయి.

Update: 2023-10-29 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రామాల్లో అధికార బీఆర్ఎస్ నేతలను అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న బీఆర్ఎస్‌కు అవే సంకటంగా మారుతున్నాయి. ఊర్లల్లో దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ వంటి మిగతా కీలక పథకాలు అందనివారు ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. ప్రచారానికి వస్తున్న అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో అనూహ్య పరిణామం ఎదురైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని క్యాసారం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల ప్రచారాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/Dy_z5IkFE2o

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News