బ్రేకింగ్: చంచల్ గూడ జైలు నుండి YS షర్మిల విడుదల

వైఎస్సార్టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు.

Update: 2023-04-25 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. పోలీసులపై దాడి కేసులో షర్మిల సోమవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. షర్మిలను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమె 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో షర్మిల న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఇవాళ చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. షర్మిల చంచల్ గూడ్ జైలు నుండి బయటకు వస్తుందన్న విషయం తెలసుకుని వైఎస్సీఆర్టీపీ కార్యకర్తలకు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆమెకు స్వాగతం పలికారు.

Also Read..

నా శరీరాన్ని తాకే వీడియోలు బయటపెట్టలేదు: YS షర్మిల సీరియస్

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News