Revanth Reddy: యాదవ సంఘాల డెడ్‌లైన్.. రేవంత్ రెడ్డి సారీ చెప్తాడా?

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గొల్లకురుమ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Update: 2023-05-12 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గొల్లకురుమ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సారీ చెప్పాలని యాదవ సంఘాలు శుక్రవారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించాయి. క్షమాపణ అడగకపోతే గొర్రెలు, దున్నలతో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. తమపై ఇష్టారీతిన మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్పందిస్తారా? లేదా? అనేది ఉత్కంఠంగా మారింది.

కాగా, ‘‘కేసీఆర్ కాళ్లు పిసికినంత సులభం కాదు తనను పిసకడమంటే. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా కాలం దున్నపోతుల కాశారు. ఆ సమయంలో పెండ పిసికి పిసికి పిసికేస్తానని మాట్లాడుతున్నాడు. పాన్ పరాగ్ తినే తలసాని తన గురించి మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా తలసాని తనలాగా అధ్యక్షుడు కాలేడు. దున్నపోతులను కాసిన తలసాని.. వాటితో తిరిగి ఆయన కూడా దున్నపోతు అనుకుంటున్నారు’’ అని తలసానిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్‌పై యాదవ కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read.

‘బ్రిటన్​ఎంపీలను మోసగించిన బీఆర్ఎస్.. అంబేద్కర్​పేరుతో అసత్య ప్రచారం’ 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News