జింబాబ్వేతో డబ్ల్యూటీఐటీసీ ఒప్పందం

తెలుగు నిపుణుల యొక్క ఆవిష్కర‌ణ‌లు, ఒప్పందాల రంగాల్లో వ‌ర‌ల్డ్ తెలుగు ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ కౌన్సిల్ నెట్ వ‌ర్క్ ముందుకు సాగుతున్నది.

Update: 2024-05-22 15:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు నిపుణుల యొక్క ఆవిష్కర‌ణ‌లు, ఒప్పందాల రంగాల్లో వ‌ర‌ల్డ్ తెలుగు ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ కౌన్సిల్ నెట్ వ‌ర్క్ ముందుకు సాగుతున్నది. అఫ్రిక‌న్ బిజినెస్ టూర్లో భాగంగా బుధవారం నెట్ వర్క్ బృందం జింబాబ్వేకు చేరుకున్నది. భార‌త్ రాయ‌బారి డాక్టర్ గాడ్ ఫ్రే మ‌జోని చిపారే, జింబాబ్వే ఇన్వెస్ట్‌మెంట్ డెవ‌ల‌ప్మెంట్ ఏజెన్సీ (జిదా) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోష‌న్ ఆఫీస‌ర్ సిలిబాజిసో చిజ్వినా, అధికారుల‌తో భేటీ అయ్యారు. టెక్నాల‌జీ, ఆరోగ్య, ఫార్మా, అగ్రిటెక్ రంగాల్లో భాగస్వామ్యంపై ఎంఓయూ చేసుకున్నారు. డ‌బ్ల్యూటీఐటీసీ నెట్‌వ‌ర్క్ చైర్మన్ సందీప్ కుమార్ మ‌క్తాల మాట్లాడుతూ.. భార‌త్ - జింబాబ్వే దేశాల మ‌ధ్య ఆవిష్కర‌ణ‌లు, టెక్నాల‌జీ రంగాల్లో కీల‌క ముంద‌డుగు వేయ‌డానికి ఈ పర్యటన దోహ‌ద‌ప‌డుతుందన్నారు.

వ్యవ‌సాయం, వైద్యారోగ్య రంగం, ఫార్మాస్యూటిక‌ల్‌, విద్యారంగాల్లో టెక్నాల‌జీ, నైపుణ్యత‌ను పెంపొందించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని వెల్లడించారు. ఫిన్ టెక్ రంగంలో కూడా త‌మ‌కు స‌హాయం అందించాల‌ని జింబాబ్వే ఇన్వెస్ట్‌మెంట్ డెవ‌ల‌ప్మెంట్ ఏజెన్సీ కోరినట్లు తెలిపారు. టెలీ మెడిసిన్, మెడిక‌ల్ ట్రాన్స్ ప్లాంట్స్‌, వాట‌ర్ ట్రీట్మెంట్ టెక్నాల‌జీ రంగాల‌లో జింబాబ్వే దేశానికి గ‌ల ఆస‌క్తి సైతం ప్రస్తావ‌న‌కు వ‌చ్చిందన్నారు. ఈ-గ‌వ‌ర్నెన్స్ రంగంలో మెరుగైన నైపుణ్యాల‌ను స్వీక‌రించ‌డం, ఎడ్యుటెక్ అంశంలో ఇన్నోవేటివ్ సొల్యూష‌న్స్ పొంద‌డం ప‌ట్ల సైతం జింబాబ్వే ఇన్వెస్ట్‌మెంట్ డెవ‌ల‌ప్మెంట్ ఏజెన్సీ ఆస‌క్తిని క‌న‌బ‌ర్చినట్లు వెల్లడించారు. బృందంలో టీ క‌న్సల్ట్ లీడ‌ర్‌షిప్ చ‌ల్లన‌గారి న‌రేంద్ర, తిరున‌హ‌రి వంశీకృష్ణ, కొండ‌ల్ రెడ్డి పాల్గొన్నారు. 

Similar News