ఉమెన్స్ డే నాడే టీటీడీపీలో బయటపడ్డ వర్గపోరు! (వీడియో)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.

Update: 2023-03-08 13:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఖమ్మం టీడీపీ కార్యాలయంలో తమపై దాడులు చేశారంటూ పరస్పరం ఇరు వర్గాలు పార్టీ ఆఫీస్‌లోనే ఆందోళనకు దిగారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన్న తమపై దాడికి దిగారని టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ ఆరోపించాడు. వికలాంగుడినైన తనను ప్రసూన్న ఆమె అనుచరులు దాడి చేశారని వెంటనే వారు క్షమాపణలు చెప్పాలని నిరసనకు వ్యక్తం చేశాడు. మరో వైపు తెలుగు యువత నాయకులే తమపై దాడి చేశారంటూ ప్రసూన్న వర్గీయులు ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Tags:    

Similar News