దారి తప్పిన అడవి దున్న.. (వీడియో)

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధి నిడ్జింత గ్రామ శివారు దేవరగట్టు తండా సమీపంలో అడవి దున్న దారి తప్పి గొర్రె కాపరులు, రైతుల కంట పడింది.

Update: 2023-03-05 10:00 GMT

దిశ, కొత్తపల్లి: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధి నిడ్జింత గ్రామ శివారు దేవరగట్టు తండా సమీపంలో అడవి దున్న దారి తప్పి గొర్రె కాపరులు, రైతుల కంట పడింది. అడవి దున్న వెంట కుక్కలు పడడంతో అప్పిరెడ్డి పల్లి గ్రామ శివారు వైపు పరుగులు తీసింది. స్థానికులు అడవి దున్న పరుగు పెడుతున్నపుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇంకా తెలియరాలేదు. ఇది ఇలా ఉండగా అడవి దున్న మనుషులపై దాడి చేస్తోందేమోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags:    

Similar News