కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరు: డిప్యూటీ సీఎం భట్టి

ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Update: 2024-05-07 15:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజలు చూస్తూ ఉరుకోరని హెచ్చరించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కి అవకాశం దొరికితే రిజర్వేషన్లు మార్చడానికి కుట్ర చేస్తుందని వెల్లడించారు. బీజేపీ అసలు ఎజెండా కులాల రిజర్వేషన్లు రద్దు చేయడమే అని వ్యాఖ్యానించారు. ఇందుకు కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గు చేటు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. 2/3 మెజారిటీతో రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ పదాన్ని తొలగించాలని చూస్తున్నారన్నారు. దీన్ని దేశ వ్యాప్తంగా ప్రజలంతా గమనించాలన్నారు. బీజేపీ పవర్ లోకి రాకుండా చేసే బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీలదే అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోయి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్నారు. చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని 3 నెలల్లోనే చక్క దిద్దామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ను భయపెట్టాలని చూస్తున్నాయన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పితే సీఎం ను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. హిట్లర్, ముస్సోరి లాగా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తుందన్నారు. పది ఏండ్లలో నే దేశం అల్లకల్లోలం అయిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత బడుగు బలహీన వర్గాలదే అన్నారు. ఇది ప్రజా స్వామ్యనికి అత్యంత దయనీయమైన పరిస్థితి అన్నారు. బీజేపీ వలన బలహీన వర్గాలు ,దళిత, గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

బీజేపీకి ఓటేస్తే భవిష్యత్ లేకుండా పోతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారత దేశం పెను ప్రమాదం లోకి నెట్టి వేయబడుతుందన్నారు. ఆ కుట్రని అర్థం చేసుకొని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేశారన్నారు. ఓబీసీ కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం ఆస్తులు పంచుతామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన చేపడుతామన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైందన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలిచేలా సాయం చేయాలన్నారు.

Read More...

BREAKING: భారత రాజ్యాంగం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు 

Similar News