నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీకి మోక్షమెప్పుడు ?

ఆసియాలోనే అతి పెద్దదైన నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీని 2014లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహిస్తుందని నాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రకటించారు.

Update: 2023-04-12 16:13 GMT

దిశ, వెబ్డెస్క్ : ఆసియాలోనే అతి పెద్దదైన నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీని 2014లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహిస్తుందని నాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రకటించారు. ఆయన అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు అయినా దానికి మోక్షం కలగలేదు. పైగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 డిసెంబర్ 24వ తేదీన నిజాం షుగర్ ఫ్యాక్టరీని దాని యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. 2006 వరకు రోజూ 5 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును క్రషింగ్ చేసే సామర్థ్యం గల ఈ ఫ్యాక్టరీని ఎప్పుడు తెరుస్తారని, తమకు మళ్లీ జీవనోపాధి ఎప్పుడు కల్పిస్తారని బోధన్ లో రోడ్డున పడిన వందలాది మంది కార్మికులు అడుగుతున్నారు.

Tags:    

Similar News