Telangana Budget 2023: మున్సిపల్ శాఖకు కేటాయింపులు ఎన్నంటే?

పట్టణ ప్రజలకు మౌళిక వసతులు కల్పించడం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-02-06 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: పట్టణ ప్రజలకు మౌళిక వసతులు కల్పించడం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్బన్ మిషన్ భగీరథ కింద 141 మున్సిపాలిటీల్లో 6578 కోట్లతో ఇంటింటికీ సురక్షిత తాగునీటి జలాలను అందిస్తున్నామన్నారు. ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫైఓవర్లు, అండర్ పాస్ లు అభివృద్ధి చేస్తున్నామన్నారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.387కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 32,218 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. విమాన ప్రయాణీకలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. రూ.6250 కోట్లతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రోకు రూ. 500కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు రూ.11,372 కోట్లు ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read..

Telangana Budget 2023: మధ్యాహ్న భోజన కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

Tags:    

Similar News