సీఎం, డీప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారు?.. హరీష్ రావు సూటి ప్రశ్న!

విద్యార్థులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని, దీనిపై సీఎం డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు.

Update: 2024-04-29 13:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని, దీనిపై సీఎం డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. నీటి విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు దీనిపై హరీష్ రావు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఖండించారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ పాలనలో కరెంటు కొరత, నీళ్ల కొరత ఉందని విద్యార్థులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని తెలిపారు.

రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని కాంగ్రెస్ నాయకులు దబాయిస్తున్నారని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితులకు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలను, వారి భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి సంకుచిత చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా ఎండాకాలం నీటి ఎద్దడి, కరెంటు కోతల కారణంగా 01 మే, 2024 నుంచి 31 మే, 2024 వరకు సమ్మర్ సెలవులు ప్రకటిస్తూ.. చీఫ్ వార్డెన్ నోటీస్ విడుదల చేశారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ఆ నోటీస్ తో పాటు విద్యార్ధులు ఆందోళన చేపడుతున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

Read More...

‘రేవంత్ రెడ్డి పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి’ 

Tags:    

Similar News