Weather Report: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Update: 2024-05-24 03:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్యం వైపుగా ప్రయాణిస్తూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపాన్‌గా మారుతుందని పేర్కొంది. ఈ తుపాన్ ఉత్తర దిశలో కదులుతూ.. మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారి 26న బంగ్లాదేశ్‌ను అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. ఇక నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రాగాల రెండు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం, శనివారం తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మేడ్చల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News