తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించండి : ఎమ్మెల్యే నాయిని

రంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీలో పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేయూ విద్యార్థి సంఘాలు ప్రచారం నిర్వహించాయి

Update: 2024-05-25 10:34 GMT

దిశ, కేయూ క్యాంపస్ : వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీలో పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేయూ విద్యార్థి సంఘాలు ప్రచారం నిర్వహించాయి. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, అరాచకాలును ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి నిఖార్సైన జర్నలిస్టుగా పేరొందిన తీన్మార్ మల్లన్నకు మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Similar News