మేడి గడ్డలో ఏమైంది, గేట్లు మూసివేత.?

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డలో అసలు ఏం జరుగుతుంది, గేట్లను మూసివేసి నో ఎంట్రీ బోర్డులు ఎల్ ఎన్ టి, ఎందుకు ఏర్పాటు చేసి మీడియాను అనుమతించకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-05-25 13:25 GMT

దిశ, మహాదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డలో అసలు ఏం జరుగుతుంది, గేట్లను మూసివేసి నో ఎంట్రీ బోర్డులు ఎల్ ఎన్ టి, ఎందుకు ఏర్పాటు చేసి మీడియాను అనుమతించకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడిగడ్డ లోపాలు తెరపైకి రావడం తోనే నిర్మాణ సంస్థ గేట్లను మూసివేయడం జరిగిందని అనుకుంటున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్లాక్ లోని 8 గేట్ల ను తెరిచే పరిస్థితి లేకపోవడంతో, మేడి గడ్డ బ్యారేజ్ వద్ద మరో వ్యవహారం బయటపడింది. ఈరోజు చెడిపోయిన ఏడవ బ్లాక్ లోని లిఫ్ట్ గేట్ తెరిచే పరిస్థితి లేకపోవడంతో గేట్ విప్పుటకు ఎల్ ఎం టి సిబ్బంది, లిఫ్ట్ గేట్ కు బిగించిన నట్లను తీసి వేయడం జరుగుతుంది.

అలాగే 21 పిల్లర్ వద్ద ఏర్పడినటువంటి భారీ గుంటలో ఇసుక సంచుల్లో నింపి గుంట ను పూడ్చే పనులను చేపడుతున్నారు. మరోవైపు ఏడవ బ్లాక్ దిగువ భాగంలో ఏర్పడినటువంటి ఇసుక మేటులను తొలగించడం జరుగుతుంది. ఇప్పటికే బ్యారేజీ వద్ద పిల్లర్లు కుంగిపోయి లిఫ్ట్ ద్వారా గేట్లను ఎత్తి పరిస్థితి లేకపోవడం, ఈరోజు లిఫ్ట్ చేయాల్సిన గేటు తొలగించుటకు నిర్మాణ సంస్థ ఎల్ ఎన్ టి సిబ్బంది లిఫ్ట్ గేట్లకు బిగించిన నట్లను తొలగించడం జరుగుతుంది.మరోవైపు కాపర్ డ్యాం తో పాటు చెడిపోయిన సెవెంత్ బ్లాక్ ముందు మట్టి తో కట్టను ఏర్పాటు చేశారు కానీ ప్రస్తుతం ఉన్న గోదావరి లోని రెండు వేల క్యూసెక్ ల వరద తాకిడికి ఇసుక కొట్టుకపోవడం గమనార్ధం, రాబోయే రోజుల్లో భారీ వర్షాల ప్రభావంతో వరద తాకిడికి ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేక లోపాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పడం కూడా జరిగింది. అలాగే పనుల్లో జాగ్రత్త వహించాలని కూడా సూచించింది, కానీ ప్రస్తుతం మేడిగడ్డ ఏడవ బ్లాక్ వ్యవహారం, రోజుకొక మలుపు తిరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న భారీగా ఏర్పడిన గుంతలు, 16వ నంబర్ గేట్ ఎత్తివేయడంలో భారీ శబ్దాలు, గేట్లకు అమర్చినటువంటి కొన్ని వస్తువులు కింద పడిపోవడం లాంటి తెరపైకి రావడం జరిగింది.

తాజాగా ఈరోజు ఏడవ బ్లాక్ లోని ఒక లిఫ్ట్ గేట్ పనిచేయకపోవడంతో లిఫ్ట్ సహాయంతో ఎత్తి వలసిన గేట్ తీసివేసే పరిస్థితికి రావడంతో ఎల్ ఎన్ టి సిబ్బంది లిఫ్ట్ గేట్లు తీసివేసి పనులు చేపట్టడం జరిగింది. ఇలా మేడిగడ్డ బండారం బయటపడుతుంటే నిర్మాణ సంస్థ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎవరికి అనుమతి లేదని సూచిక బోర్డును ఏర్పాటు చేసి బ్యారేజీ వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బ్యారేజ్ గేటుకు తాళం వేయడం బ్యారేజ్ లో భారీగా లోపాలు ఉన్నాయి, అనుమానాలు కాదు వాస్తవాలు అని చెప్పేలా వ్యవహరించడం జరిగింది.

Similar News