తహసీల్దార్ పై గిరిజనుల రాళ్ళ దాడి..

మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మన్యుల్ పై గిరిజన రైతులు దాడి చేసిన సంఘటన ఆదివారం సంచలనం సృష్టించింది.

Update: 2023-06-18 13:43 GMT

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మన్యుల్ పై గిరిజన రైతులు దాడి చేసిన సంఘటన ఆదివారం సంచలనం సృష్టించింది. వివరాలలోకి వెలితే జిల్లా కేంద్రంలోని సాలర్ తండా సమీపంలో 255 సర్వేనెంబర్ లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు భూ సర్వే కోసం వెళ్లారు.

ఈ క్రమంలో రెవెన్యూ అధికారులను గిరిజన యువకులు, మహిళలు అడ్డుకున్నారు. ఈ భూమి మాది అంటూ దౌర్జన్యం చేశారు. గిరిజనులకు రెవెన్యూ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. బాధిత రైతులు తహసీల్దార్ పై రాళ్ళ తో దాడి చేసి గాయపరిచారు. వెంటనే తహసీల్దార్ ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా జిల్లాలో భూ మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News