‘దిశ’ ఎఫెక్ట్.. దశాబ్దాల సమస్యకు పరిష్కారం

ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య

Update: 2024-05-11 08:52 GMT

దిశ,డోర్నకల్ : ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య పరిష్కరించేంత వరకు ఎంపీ ఎలక్షన్ బైకాట్ చేస్తున్నట్లు సిగ్నల్ తండావాసులు ప్లెక్సీలు కట్టిన విషయం పాఠకులకు తెలిసిందే.ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకముందే దిశ దినపత్రికలో "నాయకులెవరు ఓట్లడిగేందుకు రావొద్దు"అనే శీర్షికను 4 పీఎం డైనమిక్ ఎడిషన్ ప్రచురణతో గంటల వ్యవధిలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ స్పందించడం అలాగే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించడంతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘దిశ’ దినపత్రికకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News