మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి : కేటీఆర్

వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని

Update: 2024-05-22 15:56 GMT

దిశ,వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బుధవారం నాని గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్, బండ ప్రకాష్ టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి అని, మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని, నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు విద్యుత్ నిలిచిపోయి రోగులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, 2లక్షల రుణమాఫీ, రైతు బంధు రైతులకు ఇప్పటివరకు రాలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, వారికి 500 బోనస్ దక్కాలేదని, రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే రాకేష్ రెడ్డి ని గెలిపించాలి కోరారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చారని, 24 అంతస్తు ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోయాయని, కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులని తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుందని అన్నారు.

Similar News