ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ : కలెక్టర్

వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న శాసనమండలి

Update: 2024-05-25 11:55 GMT

దిశ, వరంగల్ కలెక్టరేట్ : వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న శాసనమండలి ఉపఎన్నికకు జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యా సంస్థలు/ కార్యాలయాలకు ఈ నెల 26, 27 న పెయిడ్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8. గంటల నుండి సాయంత్రం 4. గంటల వరకు నిర్వహించడం జరుగుతున్నదని, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు వారి ఉద్యోగులకు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Similar News