ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి..

ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని బిజెపి నాయకులు అన్నారు. శనివారం వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని సిరిపురం గార్డెన్ లో ఏర్పాటు చేశారు

Update: 2024-05-25 15:26 GMT

దిశ, హనుమకొండ టౌన్ : ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని బిజెపి నాయకులు అన్నారు. శనివారం వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని సిరిపురం గార్డెన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం చివరి రోజు అని , ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందని ఆలోచించి ఓటు వేయాలి అని అన్నారు.

రేవంత్ రెడ్డి 420 హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని, సీఎంగా పదవి భాద్యతలు చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు అని, గతంలో నిరుద్యోగులను దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ రెచ్చగొట్టింది అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా నిరుద్యోగులు వాస్తవాలు గ్రహించి ఓటు వేయాలి అని తెలిపారు. తీన్మార్ మల్లన్న ఎక్కడ చదువుకున్నాడో తెలియదు కానీ, తీన్మార్ మల్లన్న కు బ్లాక్ మెయిలింగ్ తప్ప ఏదీ రాదు అని అన్నారు. ప్రశ్నించే వారిని ఇష్టమొచ్చినట్టు తిట్టడమే తీన్మార్ మల్లన్న పని అని,

పొద్దున లేస్తే ఇతరులపై దుర్భాషాలడే మల్లన్నకు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు.?. ఈ నెల 27 వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు బిజెపి పార్టీలోనే 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి శ్రీనీవాసరావు, జిల్లా నాయకులు విజయ రావు, సుభాష్, వెంకటేశ్వర్లు,అసెంబ్లీ కన్వీనర్ అంజి రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ యుగంధర్, మహిళ మోర్చ నాయకురాలు విజయలక్ష్మి, మైనారిటీ జిల్లా అధ్యక్షులు వలి పాషా, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News