ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి.. ఆసుపత్రి పేరుతో నిర్వహణ

హన్మకొండ పట్టణం 7 వ డివిజన్ లోని కాకాజీ కాలనీలో 86 పైగా

Update: 2024-05-27 10:12 GMT

దిశ,హనుమకొండ : హన్మకొండ పట్టణం 7 వ డివిజన్ లోని కాకాజీ కాలనీలో 86 పైగా వివిధ ఆస్పత్రులు ఉన్నాయి. వేలమంది ఆరోగ్య సమస్య బాధపడుతూ ఇక్కడ ఉన్న డాక్టర్లను సంప్రదిస్తారు.మొదటగా కేవలం మెడికల్ డ్రగ్స్ స్టోరేజ్ హబ్ గా ఉన్న కాకాజీ కాలనీ ప్రస్తుతం వివిధ ఆస్పత్రులకు కేంద్ర బిందువు అయ్యింది.గత కొన్ని రోజులుగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.ఇంటి పన్ను తో పాటు కార్పొరేషన్ కు రావలసిన పన్నులను వందకు వంద శాతం వసూలు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.అందులో భాగంగా మొండి బకాయి పన్ను వివిధ సమస్యల కారణంగా కోర్టులో పెండింగ్ కేసుల విషయం తీసుకోవాల్సిన నిర్ణయాలను అధికారులు సమీక్షించారు.

అందులో భాగంగా గతం లోని ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టలని నిర్ణయించారు.హన్మకొండ నడి మధ్యలో ఉన్న కాకాజీ కాలనీ స్థలం మొదటి నుండి వివాదం కొనసాగుతున్న అదే స్థాయిలో నిర్మాణాలు జరగడం పలు విమర్శలకు తావు ఇస్తుంది.ఎప్పటినుండో నివాసం ఉంటున్నామని పాత నిర్మాణం శిథిలావస్థలో ఉంది కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ, అనుమతులు రాకున్నా నిర్మాణాలు జరిగిన సందర్భలు ఉన్నాయని జగమెరిగిన సత్యం. ఇంతింతై వటుడు ఇంత అయి అన్న చందంగా కాకాజీ కాలనీ కాస్త డాక్టర్ ల కాలనీ గా మారిపోయింది.అయినా కార్పొరేషన్ అధికారులు మాత్రం ఇంటి పన్ను వసూలు చేస్తున్నారని ,నిబంధనలు విరుద్ధంగా అనుమతులు లేకున్నా ఆస్పత్రులు ,కమర్షియల్ కట్టడాలు నిర్మించి లక్షల్లో కిరాయికి ఇచ్చి పన్నులు చెల్లిస్తున్నారని గతం లో ఫిర్యాదులు అందాయి.

అయినా కానీ కమర్షియల్ టాక్స్ లు కట్టాల్సిన దగ్గర నామమాత్రపు పన్నులు చెల్లిస్తూ అటు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులను మోసం చేస్తున్న వారిపై చేర్యాలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.గత కొన్ని రోజులుగా కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.కాలనీలో నిర్మాణ యజమాని గజాల చొప్పున కమర్షియల్ గా అద్దెకు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.అదే విధంగా బహిరంగంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు కు ఇరువైపులా వాహనాలను పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అధికారులు గ్రహించారు.పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు చేరవేస్తామని ఆతదుపరి నిర్ణయం ఉంటునని తెలిపినట్లు సమాచారం. అక్రమాల పై అధికారులు పన్ను కొరడా ఝలిపిస్తారా లేక ఝలకిస్తారా చూడాలి.

Similar News