చిమ్మ చీకటిలో రోగులు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..

ఉత్తర తెలంగాణకు పేదల పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మా గాంధీ

Update: 2024-05-22 14:47 GMT

దిశ, వరంగల్ : ఉత్తర తెలంగాణకు పేదల పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రిలో రాత్రి ఒక్కసారిగా విద్యుత్ నిలిచిపోయింది. ఈదురు గాలులతో ఎంజీఎం కు సరఫరా కావలసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో తలెత్తిన సమస్యల కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. అదే సమయంలో ఎంజీఎం లో ఉన్న జనరేటర్ పనిచేయకపోవడంతో చిమ్మ చీకట్లో రోగులు, చిన్న పిల్లల వార్డులో చిన్నారుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరిగా గాలి వెలుతురు లేని కారణంగా కొందరికి ఊపిరి ఆడక భయం భయం తో గడిపారు. మరి కొందరు రోగులు సెలైన్ బాటిలను పట్టుకుని వరండాలోకి నడుచుకుంటూ వెళ్లి కూర్చున్నారు. దాదాపు 5 గంటలు విద్యుత్ లేక రోగులు నానా నరక యాతన పడుతున్న అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడం ఏమిటని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వ్యవహరించిన జెనరేటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోవాలని రోగుల, రోగుల బంధువులు డిమాండ్ చేశారు.

Similar News