పేలిన ఒప్పో ఫోన్.. తృటిలో తప్పించుకున్న జగన్ (వీడియో)

Update: 2023-04-13 06:14 GMT

దిశ, వరంగల్ టౌన్: ఒప్పో ఏ 54 మొబైల్ ఫోన్ పేలిన సంఘటన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో చోటుచేసుకుంది. సంబంధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా.. పెద్ద గూడూరు గ్రామానికి చెందిన అంగోతు జగన్ అనే రైతు గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు మిర్చి బస్తాలు తీసుకువచ్చారు. అక్కడే 13వ యార్డులో తన సరుకు దించుకున్నారు. ఖరీదు దారుల కోసం ఎదురుచూస్తుండగా తన జేబులోని ఒప్పో ఏ 54 మొబైల్ ఫోన్ వేడెక్కి నట్లు గుర్తించాడు. వెంటనే ఆ సెల్ ఫోన్‌ను దూరంగా కింద పడేసాడు అంతలోనే అది పేలింది. అదే జేబులో గానీ, చేతిలో గానీ పేలి ఉంటే జగన్‌కు ప్రాణహాని జరిగి ఉండేదని, లేచిన గడియ బాగుండి ఎం జరగలేదని తోటి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Full View
Tags:    

Similar News