దేశ సంపద ప్రజల ఆస్తులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే : భట్టి విక్రమార్క

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని దేశంలో

Update: 2024-05-14 12:07 GMT

దిశ, కాటారం : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని దేశంలో ఇండియా కూటమిదే అధికారం చేపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ప్రజల ఆస్తులు, సంస్థలు ,వ్యవస్థలు , వనరులు అన్నీ కూడా ప్రజలకే ఉండాలని ఈ దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే దేశ సంపదను కాపాడుతున్న కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు విశ్వసించి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించబోతున్నట్లు పోలింగ్ సరోలింగంబట్టి స్పష్టంగా తెలుస్తోందని, ఈ రాష్ట్రంలో 12 నుండి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్లు  అన్నారు.

దేశంలో కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన జోడో పాదయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టిన బస్సు యాత్ర ఈ దేశ జీవన విధానం , ఆర్థిక పరిస్థితులు పరిరక్షణ పై స్పష్టత ఇస్తూ అతి పెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఉండటానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఎంతో పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిలిచిందని అన్నారు. ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరి గా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా చూపించబోతున్నారని అన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని , ద్వారా దేశంలో ఉన్న దేశ సంపదను కాపాడేందుకు రాబోయే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ ల ద్వారా అధికారంలోకి వస్తుందని స్పష్టం అవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఆర్థికపరమైన, సామాజిక పరమైన భావజాలాన్ని పక్కనపెట్టి కొన్ని రాజకీయ పార్టీలు వారిపై వారు నమ్మకం కోల్పోయి వేరే రకరకాల విషయాలు రాజకీయాలకు సంబంధం లేని అంశాలను చెప్పించి లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేయగా వీటన్నింటినీ ప్రజలు గమనించి ప్రజాస్వామ్యానికి కావాల్సిన అంశాలనే తీసుకొని నిలబడేది ప్రజల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కేంద్రంలో తప్పకుండా ఇండియా కూటమి అధికారం ఏర్పాటు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడలో దత్తాత్రేయని వార్షిక ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఇది రాష్ట్ర ప్రజలకు శుభాన్నిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యులు విజయ రమణారావు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గండ్ర సత్యనారాయణ రావు కార్పొరేషన్ చైర్మన్లు అయిత ప్రకాష్ రెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాటారం ఎంపీపీ లు పంతగాని సమ్మయ్య , మలహాల్ రావు, రాని బాయ్, నాయకులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, చీమల సందీప్ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News