నాయకులెవరు ఓట్లకు రావద్దు.. రోడ్డు వెయ్యండి.. లేదా పడవలు ఇవ్వండి.. : సిగ్నల్ తండా వాసులు

ఓట్ల కోసం వచ్చే నాయకులే తప్ప.. అభివృద్ధి చేసే నాయకులు

Update: 2024-05-08 09:38 GMT

దిశ,డోర్నకల్ : ఓట్ల కోసం వచ్చే నాయకులే తప్ప.. అభివృద్ధి చేసే నాయకులు కరువయ్యారని సిగ్నల్ తండా పౌరులు ఆరోపిస్తున్నారు.డోర్నకల్ మున్సిపాలిటీ నాలుగో వార్డులో అందవలసిన సౌకర్యాలు అందడం లేదని వాపోతున్నారు.ఆర్ అండ్ బి రోడ్డు నుంచి ఆర్ఓబి వరకు రోడ్డు చిలుకు పడితే చిత్తడిగా మారుతుందని అంటున్నారు.వార్డు సభ్యుడు నుంచి పార్లమెంటు సభ్యుడు వరకు గిరిజనులే అయినా రోడ్డు సౌకర్యం కల్పించే నాథుడే లేడని వాపోతున్నారు. 2,500 జనాభా ఉన్న సరైన రోడ్డు మార్గం లేక వానాకాలంలో నరకయాతన పడుతున్నట్లు ఆవేదన చెందుతున్నారు.

ఇటీవల రూ.52 లక్షలతో పనులు ప్రారంభించిన అనివార్య కారణాలతో పనులు నిలిచినట్లు చెబుతున్నారు. 8 దశాబ్దాలుగా పాలించిన పాలకులు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.లేని పక్షంలో ఇంటికో పడవ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక్కడి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు నాయకులెవరు ఓట్లు అభ్యర్థించుటకు తండాకు రావద్దంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే నేటి సాయంత్రం నిరసన ప్రదర్శనతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News