మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు : కడియం కావ్య

వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ,

Update: 2024-05-01 13:55 GMT

దిశ,వరంగల్ : వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ తూర్పు కార్యకర్తలను కలిసిన కొండా సురేఖ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తూర్పులో ఖాళీ అయిన బీఆర్ఎస్, బీజేపీ లతోన మాకు పోటీ అని హెద్దేవ చేశారు. రామున్ని ప్రతిష్ట లంటే , రాముడిని ఒక్కడినే కాదు, సతీ సమేతంగా విగ్రహ ప్రతిష్ట చేయాలని, నరేంద్ర మోదీ బ్రహ్మచారి కాబట్టి సీతతో కాకుండా రామునొక్కడినే ప్రతిష్టాపించాడని పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికలు రావడం తో రాముని పేరు చెప్పి ఓట్లు అడగడం సిగ్గుచేటని, మైనారిటీ రిజర్వేషన్ తీసేయడం దీనికి నిదర్శనం అన్నారు. మత రాజకీయాలు చేయడంలో బిజెపి ముందంజలో ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ రజాకార్ల వ్యవస్థ వస్తుందన్న భయం వేస్తుందన్నారు. ఆగస్టు 15వ తేది లోపు 2 లక్షలు ఉన్న రైతుల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తామని, 92 శాతం రైతుబంధు ఇప్పటికే ఇచ్చామని తెలిపారు. కాళేశ్వరం, మేడిగడ్డ నీరు వదలడంలో చాలా ప్రమాదకరంగా ఉందని, ఉద్యోగులకు రెండో తేదిన జీతాలు వేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా నిలబడ్డ వారంతా చరిష్మా లేని అభ్యర్థులని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి పక్కా వస్తుందని స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య నిలబడుతుందని, ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. బీజేపీ చేస్తున్న, ప్రజలకు చేసిన మోసాలు ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తాం అని తెలిపారు. అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని, మతతత్వ పార్టీల మాటలు నమ్మవద్దని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు.

నరేంద్ర మోడీ భక్షకుడని, బీజేపీ పదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని, బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనపై ఉందని, అదానీ, అంబానీలకు అండగా మోదీ నిలుస్తున్నాడన్నారు. వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో కుల మతాల మధ్య విద్వేషాలు పెరిగాయే తప్ప అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. దేశ సమైక్యతను విచ్చిన్నం చేసే శక్తులకు తగిన గుణపాఠం చెప్పాలని రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశ ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని, దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహణ జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం ఇస్తున్న రిజర్వేషన్​ పరిమితి​ పెంచుకుందాం అని, మీ ఆడబిడ్డగా ఆశీర్వదించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News