పార్కుల నిర్వహణ సక్రమంగా జరపాలి : బల్దియా కమిషనర్

పార్కుల నిర్వహణ సక్రమంగా జరపాలని కమిషనర్ అశ్విని తానాజీ

Update: 2024-05-22 14:51 GMT

దిశ,వరంగల్ టౌన్ : పార్కుల నిర్వహణ సక్రమంగా జరపాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. హన్మకొండ పరిధి హాసన్ పర్తిలో బల్దియా చే నిర్వహించబడుతున్న కుక్కల శస్త్రచికిత్స కేంద్రం (ఎబిసి) తో పాటు శ్రీనగర్ కాలనీ పార్క్ శాంతి వనం తో పాటు వరంగల్ పరిధి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు గల రీజనల్ లైబ్రరీ పార్కులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేస్తూ నగర వ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణకు చేపట్టే శస్త్ర చికిత్స లలో వేగం పెంచడంతో పాటు ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో ఆపరేషన్లు జరిగేలా చూడాలని అన్నారు.

నియమబద్ధంగా స్టెరిలైజేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పార్కుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అందుకు సిద్ధంగా ఉండాలని నగరంలో కొన్ని పార్కులను టిఎల్ఎఫ్ వారికి నిర్వహణ కోసం అప్పగించడం జరిగిని ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో నిర్వహణ జరగడం లేదని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో హార్టికల్చర్ విభాగం నుంచి సిబ్బందిని కేటాయించి సక్రమంగా పార్కుల నిర్వహణ జరిగేలా చూడాలని హెచ్ ఓ ను ఆదేశించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేష్, వెటర్నరీ అధికారి డాక్టర్ గోపాల్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ భాషా నాయక్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ప్రిన్సి అశ్విని, ప్రవల్లిక, అనుయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News