అంతర్ జిల్లా దొంగను చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు..

అంతర్ జిల్లా దొంగలను చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 5 46 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి, రెండు సెల్ ఫోన్లు, ఒక యూనికాన్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు.

Update: 2024-05-23 13:59 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ : అంతర్ జిల్లా దొంగలను చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 5 46 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి, రెండు సెల్ ఫోన్లు, ఒక యూనికాన్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. గురువారం పట్టణంలో నేరాలకు పాల్పడిన వారి వివరాలు తెలియజేస్తూ.. ఎస్ఐ జి ఉపేందర్ వారి సిబ్బందితో మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు రోడ్ లోవెహికల్ చెకింగ్ చేస్తుండగా… యూనికాన్ బైక్ పై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడాన్ని గమనించారు.

వెంటనే అతనిని పట్టుకొని బండికి సంబంధించిన పత్రాలు అడుగగా, అతని వద్ద ఎలాంటి బండి పత్రాలు లేకపోవడంతో పాటు, అతను గతంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులో అరెస్ట్ అయిన చింత యుగేందర్ గా గుర్తించి అతనిని తనిఖీ చేయగా అతని వద్ద బంగారం, వెండి వస్తువులు కొన్ని సెల్ ఫోన్ లు ఉండడంతో విచారించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లలో పలుదొంగతనాలు చేసినట్లు నేరస్తుడు తెలియజేశారని, యుగెందర్ కు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో యుగెందర్,అశోక్ ఇద్దరు జల్సాలకు అలవాటుపడి ఇద్దరు కలిసి మహబూబాబాద్, గార్ల, ఖమ్మం, డోర్నకల్, సీరోలు మొదలగు ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసులలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్ సీసీఎస్ సీఐ చంద్రమౌళి, మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్, , ఎస్ఐ ఉపేందర్ లను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు.

Similar News