బ్యాంకులో బంగారం మాయం..??

మండలంలోని ఓ జాతీయ బ్యాంకులో కోటికి పైగా విలువైన బంగారం మాయమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-05-25 15:56 GMT

దిశ, మంగపేట : మండలంలోని ఓ జాతీయ బ్యాంకులో కోటికి పైగా విలువైన బంగారం మాయమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల బ్యాంకు ఆర్థిక లావాదేవీలకు సంబందించి ఆడిటింగ్ జరుగుతుండగా బంగారం మాయమైనట్లు గుర్తించిన అధికారులు బ్యాంకు మేనేజర్ సిబ్బంది దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన గోల్డ్ అప్రైజర్ గ్రామం నుండి ఉడాయించినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిని బ్యాంకు అధికారులు గోల్డ్ అప్రైజర్ గా పెట్టుకున్నట్లు తెలిసింది. బ్యాంకులో పని చేస్తూనే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని బ్యాంకు సమీపంలో గోల్డ్ షాపు పెట్టి గ్రామంలో సైతం కొంత మందికి నకిలీ బంగారం అంటగట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయమై సంబందిత అధికారులను ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు.

Similar News