జేసీబీ దొంగలు అరెస్ట్

హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు జేసీబీ దొంగలను మంగళవారం జనగామ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని... JCB thieves arrested

Update: 2023-02-14 14:27 GMT

దిశ, జనగామ: హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు జేసీబీ దొంగలను మంగళవారం జనగామ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. డీసీపీ సితార జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీబీ దొంగల వివరాలను వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఎండీ స్వాలే (24), ఎండీ శోకిన్ (20)లు హర్యానా రాష్ట్రానికి చెందినవారు. మీరిద్దరూ మేవాత్ జిల్లా పున్హానా మండలం లోహింగా కలాన్ గ్రామానికి చెందిన వారు కాగా బ్రతుకుతెరువు కోసం జనగామకు వచ్చారు. అంతకు ముందుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పనిచేస్తూ అక్కడి నుండి ఒక జేసీబీని దొంగిలించి జనగామకు తరలించారు. జనగామకు వచ్చిన వీరు ఐదు నెలల తర్వాత కలెక్టరేట్ ప్రాంతంలో కెనాల్ పనుల్లో ఉన్న మరో జేసీబీని అపహరించి ఈ రెండింటిని చంపకల్స్ ప్రాంతంలో అడవిలో దాచిపెట్టారు. ఐదు నెలల తర్వాత వాటిని హర్యానాకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి నేతృత్వంలో సీఐ ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎస్సైలు సీహెచ్. రఘుపతి, ఎస్.కె జానీ పాషా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు.

Tags:    

Similar News