దుబారా చేసిన సొమ్ముకు లెక్కలు అప్ప చెప్పండి.. కేయూకి (పాతదే కానీ) కొత్త తలనొప్పి
కాకతీయ యూనివర్సిటీ కి ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కి ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. డెడ్ లైన్ పెట్టిన ఐటీ డిపార్ట్మెంట్ 2016 నుంచి ఐటీ రిటర్న్స్ అకౌంట్స్ ఫైల్స్ చేయని కారణంగా 40 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. కాగా ఈ 40 కోట్ల డిపాజిట్‌ను రెండు విడుదలగా చెల్లించడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరినట్లు రిజిస్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కానీ నిజానికి నాన్ ప్రాఫిటబుల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ క్రింద ఉన్న యూనివర్సిటీ ఖర్చులు ఐ.టి ప్రిపరేషన్ ఫైలింగ్ ప్రాపర్‌గా సబ్మిషన్ చేయ లేదు.
దీంతో ఐ.టి శాఖ వారు 2016 లో నోటీసులకు సరిపోయిన సమాధానాలు గానీ, ప్రిపరేషన్ చేసిన అకౌంట్ ఫైల్స్ పూర్తి స్థాయిలో సబ్మిషన్ చేయడం జరగలేదు. 2016 అకడెమిక్ ఇయర్ నుంచి ఇప్పటివరకు ఉన్న వీసీలు గానీ రిజిస్ట్రార్‌లు గాని అకౌంట్ డిపార్ట్మెంట్‌గాని ఏ ఒక్కరు కూడా కేయూ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ఎప్పుడు కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో సీరియస్‌గా పట్టించుకోని కారణంగా.. ఇప్పుడు తలకు చుట్టుకుంది.
సాధారణంగా ఒక విద్యా సంస్థకు అందుతున్న నిధులు కేటాయించబడుతున్న నిధులు, ఖర్చవుతున్న విధివిధానాలు, అంచనా వేయబడుతున్న ప్రాజెక్టులు, వీటన్నిటి మీద అకౌంట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. కానీ ఈ అకౌంట్స్ ప్రిపరేషన్ 2016 నుంచి మూలకు వేశారు. 2016 లోనే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 20 కోట్లు కట్టవలసిందిగా నోటీసులు జారీ చేశారు. కానీ ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులకు రిప్లై అప్పుడు ఉన్న వీసీ గాని, రిజిస్టర్ గాని, పాలకవర్గం గాని ఇవ్వలేదన్నట్లుగా సమాచారం దీంతో ప్రతి సంవత్సరం ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసుకుంటూ వస్తుంది.
వీళ్లు కావాలని దాని పక్కకు జరిపి పర్సెంటేజ్ నిధులు దండుకుంటూ అవసరం లేని కొత్త కొత్త నిర్మాణాల పైన వెచ్చిస్తూ అన్ అకౌంటబిలిటీ ఉన్న రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు.. సొసైటీలో నెగిటివ్ గ్రాఫ్ ఉన్నా కూడా ఏమాత్రం జంకకుండా, గొంక కుండా కొత్త.. కొత్త రిక్రూట్మెంట్ చేపడుతున్నారని సమాచారం. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి, మళ్ళీ వారికి కొన్ని కొత్త పోస్టులు కేటాయించి వాళ్ళ పొరుగు సేవలను అవసరమే.. అన్నట్లుగా సబ్జెక్ట్ మెన్షన్ చేస్తూ అస్మదీయులకు (జేబులు కోసం) ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. నిజంగా ఉద్యోగాలు కావాల్సింది నిరుద్యోగులకు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లకు. కానీ వీళ్ళ దృష్టిలో ఎలిజిబిలిటీ కేవలం రిటైర్ అయిన అస్మదీయులు మాత్రమే. ఒక్కొక్కరికి రెండు, మూడు బాధ్యతలు అప్పజెప్పి ఆ పేరు మీద లక్షలాది రూపాయలు ప్రతి నెల వెచ్చిస్తున్నట్లుగా యూనివర్సిటీలో సమాచారం.
ఈ విషయాన్ని తాత్కాలిక ఎంప్లాయిస్ పలుసార్లు ఆరోపించారు. ఈ విషయం తేటతెల్లం చేయడానికి పూర్తిస్థాయిలో ఏ ఒక్కరోజు కూడా స్టాండర్డ్ మీటింగ్ కండక్ట్ చేసిన దాఖలు లేవు. యూనివర్సిటీ జాబ్‌చార్ట్ ప్రకారం ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తున్నారా!! లేదా!! అంటే యూనివర్సిటీ డెవలప్మెంట్ గ్రాఫ్‌ను చూడాల్సిందే. అవసరం ఉన్నా.. లేకున్నా నిర్మాణాల కోసం కోట్ల కొద్ది డబ్బు వృధా చేసి పర్సంటేజ్‌ల కోసం లాభం కోసం చేస్తున్న పనులు తప్ప యూనివర్సిటీ కోసం యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం కార్యనిర్మాణం చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీల నిర్మాణాత్మక పనులు ఒకటి కనిపించవు.