గన్ మిస్ ఫైర్ తో కానిస్టేబుల్ కు గాయాలు

తుపాకీ (గన్) మిస్ ఫైర్ కావడంతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ పాదానికి గాయాలైన సంఘటన ఏనుమాముల స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-04-28 16:14 GMT

దిశ, వరంగల్ టౌన్ : తుపాకీ (గన్) మిస్ ఫైర్ కావడంతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ పాదానికి గాయాలైన సంఘటన ఏనుమాముల స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఏనుమాముల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా...వరంగల్ రంగశాయిపేటకు చెందిన ఏ ఆర్ కానిస్టేబుల్ రాజేష్ ఎన్నికల బందోబస్తులో భాగంగా ఏనుమముల మార్కెట్ లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద 21 రోజులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అనుకోకుండా తనవద్దనున్న తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో రాజేష్ ఎడమ కాలు పాదానికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Similar News