బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించాలి : మాజీ మంత్రి

వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్

Update: 2024-05-22 12:34 GMT

దిశ, రాయపర్తి : వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్న ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి దయాకర్ రావు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల పార్టీ కార్యకర్తలతో మండల గ్రాడ్యుయేట్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ తీన్మార్ మల్లన్న ను వదిలించుకోవాలని, టికెట్ ఇచ్చిందని అన్నారు. కానీ పట్టభద్రులు తెలివైన వారు అనే వారు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతుందని, ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ముందు దొడ్డు వడ్లను పండించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాను అనడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రశ్నించే గొంతుగా అని సోషల్ మీడియా ద్వారా వచ్చిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పట్టబద్రులను కోరారు. విజ్ఞావంతుడైన రాకేష్ రెడ్డి కి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల ఇంచార్జ్ చల్మెడ నరసింహారావు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, నాయకులు ఎండి నయీమ్, ఆకుల సురేందర్రావు, పూస మధు, మండల కో ఆప్షన్ ఆశ రఫ్ నరసయ్య, రాజేందర్, సుధాకర్ రెడ్డి, సోమన్న, తదితరులు, పాల్గొన్నారు.

Similar News