హరీష్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న మహిళా రైతు.. కడుపుకోత మిగిలిందంటూ ఎమోషనల్

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫుట్ ఫోకస్ పెట్టింది.

Update: 2024-05-23 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో రైతులు అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి హరీష్ రావుతో గోడును వెళ్లబోసుకున్నారు. 15 రోజులు ఎండలో కష్టపడి వడ్లను ఆరపెడితే రాత్రి కురిసిన వర్షానికి మొత్తం తడిసిపొయాయని మల్లికాంబ అనే హార్ట్ పేషెంట్ మహిళ వెల్లడించింది. సగం వడ్లు చెరువులోకి కొట్టుకుపోయినయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నామని.. ఈ వర్షాలు మాకు కడుపు కోత మిగిల్చుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో హరీష్ రావు మహిళను ఓదార్చుతూ.. తడిచిన వడ్డు కూడా కొనమని నేను కలెక్టర్‌కు చెబుతానని అన్నారు.

Similar News