వాట్సాప్ గ్రూపుల్లో వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఒకరిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్ఐ గూడ అరుణ్ శనివారం తెలిపారు.

Update: 2024-05-25 15:51 GMT

దిశ,చెన్నారావుపేట: వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్ఐ గూడ అరుణ్ శనివారం తెలిపారు. చెన్నారావుపేట గ్రామ శివారు ఈర్య తండాకు చెందిన ధరంసోతు సుమన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేశాడని కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు సుమన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అరుణ్ తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టరాదని ఒకవేళ పెట్టినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News