క్యారెట్ హల్వా తినగానే వాంతులు.. హోటల్ ద్వారకపై కేసు నమోదు

కుళ్ళిపోయిన క్యారెట్, పెసర పప్పు హల్వా తిని ఓ గృహిణి తీవ్ర అశ్వస్థ కు గురైంది.

Update: 2024-05-24 09:24 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : కుళ్ళిపోయిన క్యారెట్, పెసర పప్పు హల్వా తిని ఓ గృహిణి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇలా అనారోగ్యానికి గురి చేసే భోజనం ఎలా పెడతారని ప్రశ్నించినందుకు హోటల్ యాజమాన్యం, సిబ్బంది గృహిణిపై మాటల దాడి చేసి అవమానించారు. దీంతో గృహిణి ఖైరతాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మాల్కాజిగిరికి చెందిన శ్రీధర్, స్రవంతి దంపతులు. వీరు గురువారం 3.30 గంటల ప్రాంతంలో లక్డీకాపూల్ ద్వారకా హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసి, క్యారెట్, పెసర పప్పు హల్వా తీసుకున్నారు. భోజనంలోనే కొంచెం తేడా అనిపిస్తే హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు.

సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చి హల్వా ప్యాక్ చేసారు. ఇంటికి చేరుకొని హల్వా తిందామని ప్యాకెట్ తెరవగానే ఒక రకమైన దుర్వాసన వచ్చింది. దానిని నోట్ల పెట్టగానే వాంతులు అయి స్రవంతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే హోటల్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారు దురుసుగా మాట్లాడటంతో పాటు వ్యగ్యంగా తిట్టారు. దీంతో బాధితురాలు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కుళ్ళిపోయిన హల్వాను తీసుకుని ఎఫ్ఐఆర్ 221/2024 కింద సెక్షన్ 273, 337 కింద అభియోగాలను నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Similar News