మహిళా జైలుకు విజయలక్ష్మి

షర్మిల‌ను కలవటానికి ఆమె తల్లి విజయలక్ష్మి మంగళవారం ఉదయం చెంచల్ గూడ మహిళా జైలుకు వచ్చారు.

Update: 2023-04-25 06:13 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల‌ను కలవటానికి ఆమె తల్లి విజయలక్ష్మి మంగళవారం ఉదయం చెంచల్ గూడ మహిళా జైలుకు వచ్చారు. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ ఛీఫ్‌ను కలవటానికి షర్మిల సోమవారం ఉదయం లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి బయల్దేరగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టటంతో పాటు అడ్డుకోబోయిన ఎస్సై రవీందర్‌ను తోసివేశారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై ఐపీసీ 353, 332, 509, 427 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించటంతో చెంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. మంగళవారం ఉదయం జైలుకు వచ్చిన విజయలక్ష్మి తన కూతురుని పరామర్శించారు.

Read more:

షర్మిల టెర్రరిస్టా.. హంతకురాలా?: YS విజయలక్ష్మి

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News