రాష్ట్రంలో పెరిగిన పాల ధరలు.. లీటర్ ఎంతో తెలుసా?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు విజయ డెయిరీ పాల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Update: 2022-09-04 16:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు విజయ డెయిరీ పాల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన పాల ధరల ప్రకారం టోన్డ్ మిల్క్ లీటరుపై రూ.4 పెరగ్గా, గతంలో రూ.51 ఉన్న టోన్డ్ మిల్క్ ప్రస్తుత ధర రూ.55కి పెరిగింది. ఇక అరలీటర్ ప్యాకెట్ ధర రూ.26 నుంచి రూ.28కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ అరలీటరు ధర రూ.24 నుంచి రూ.26కు, ఆవు పాల అరలీటర్ ప్యాకెట్ ధర రూ.26 నుంచి రూ.28కి పెరిగింది. పెరిగిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ఈనెల నుంచి రైతుల నుంచి పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గేదె పాల ధరను లీటరుకు రూ.46.89 నుంచి రూ. 49.40 పెంచింది. ఈ నేపథ్యంలోనే విజయ విక్రయించే పాల ధరను కూడా పెంచుతూ డెయిరీ నిర్ణయం తీసుకున్నది.

Tags:    

Similar News