HYD: నగర శివారు ఫామ్‌హౌజుల్లో అసాంఘిక కార్యక్రమాలు.. 26 మంది అరెస్ట్

హైదరాబాద్‌ శివారులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే 32 ఫామ్‌హౌజ్‌లలో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

Update: 2023-02-13 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ శివారులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే 32 ఫామ్‌హౌజ్‌లలో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు ఫామ్‌హౌజుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. నాలుగు ఫామ్‌హౌజ్‌లకు సంబంధించి దాదాపు 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్‌హౌజుల్లో అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బిగ్‌బాస్ ఫామ్‌హౌజ్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, రిప్లెజ్, గోవర్ధన్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లపై కేసులు నమోదు చేశారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News