తెలంగాణ భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్‌కు ఇవి ముఖ్యమైన ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన

Update: 2023-11-14 16:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవిష్యత్‌కు ఇవి ముఖ్యమైన ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణాలో అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ సర్కారు పని చేస్తున్నదని విమర్శించారు. రాష్టంలో దోపిడి తప్ప ఏమీ చెయ్యలేదన్నారు. కేసీఆర్ పాలనలో నియంతృత్వ పాలన ద్వారా నిజాం పాలనను చూపించారని అన్నారు. ప్రతి కార్యకర్త 15 రోజుల పాటు సెలవు లేకుండా పని చేస్తే ముషీరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. పోలింగ్ బూత్ గెలిస్తే తానూ ప్రధాని అయ్యాను అని స్వయంగా మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పూస రాజును గెలిపిస్తే నిత్యం కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సేవ చేస్తారని తాను హామీ ఇస్తున్నని అన్నారు.

Tags:    

Similar News