కడియం కావ్యకు మద్దతుగా నిరుద్యోగ జేఏసీ సంఘాలు ప్రచారం!

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్యకు మద్దతుగా నిరుద్యోగ జేఏసీ సంఘాలు ప్రచారం చేస్తున్నాయని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ తెలియజేశారు.

Update: 2024-05-02 10:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్యకు మద్దతుగా నిరుద్యోగ జేఏసీ సంఘాలు ప్రచారం చేస్తున్నాయని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఓయూ, కేయూ నిరుద్యోగ జేఏసీలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. రేపు ఎన్నికల్లో బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండవు అనేది ప్రజలంతా గ్రహించాలని, ఇప్పటికే చాపకింద నీరు లాగా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ.. రిజర్వేషన్లను పరోక్షంగా ఎత్తివేస్తోందని, ఈ కుట్ర దళితులు పసిగట్టాలని తెలిపారు.

అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల పునాదుల మీద రాజ్యాన్ని గానీ దేశాన్ని గానీ నిర్మించలేమనే స్పూర్తితో ఉపకులాన్ని చూడకుండా ఈ సారి దళితులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నిలబెట్టినటువంటి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని నిరుద్యోగ జేఏసీ ఆధ్యర్యంలో ఓటర్లని కోరారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, అందుకోసం మంత్రి రాజనర్సింహా గారి ఆధ్వర్యంలో కోర్టులో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నారని, వర్గీకరణ కోసం కృషి చేస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెబుతోందని, ఈ రోజు అధికారంలో ఉండి కూడ ఏమి చేయలేక కమిటీ వేసి కళయాపన చేస్తోందని విమర్శించారు. కొందరు బీజేపీకి తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ, కాంగ్రెస్ పార్టీని ఓడించే కుట్రలు చేస్తున్నారని, దీనికోసం దళితులంతా ఐక్యంగా ఉండి ముందు రిజర్వేషన్లను కాపాడుకుందామని, తర్వాత వర్గీకరణ కోసం కొట్లాడుదామని మనవతారాయ్ సూచించారు.

Similar News