TS TET-2024: టెట్ అభ్యర్థులకు మరో బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

తెలంగాణలో టెట్‌ అభ్యర్థులు బుధవారం నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని వెసులుబాటును కల్పించారు.

Update: 2024-05-15 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్‌ అభ్యర్థులు బుధవారం నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని వెసులుబాటును కల్పించారు. ఈ నెల 20 నుంచి జూన్‌ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పద్ధతి (సీబీటీ)లో ఉదయం, మధ్నాహ్నం సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది టెట్‌ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 45,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు అందజేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను tstet2024.aptonline.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

Tags:    

Similar News